శివంపేట్[shivampet] జనవరి 21( సిరి న్యూస్ )
శివంపేట్ మండలంలోని పిలుట్ల గ్రామంలో గ్రామసభ సమయంలో చిన్నపాటి వివాదం. ప్రజా పాలన బ్యానర్లో స్థానిక ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫోటో లేదని ప్రోటోకాల్ పాటించడం లేదని గ్రామంలో ని బిఆర్ఎస్, బీజేపీ సీనియర్ నాయకులు మండిపడ్డారు. అనంతరం టిఆర్ఎస్ బిజెపి పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ,బీజేపీ మండల అధ్యక్షుడు పెద్దపులి రవి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చింత స్వామి అశోక్ కుమార్ శివకుమార్ బుర్ర పెద్ద పోచ గౌడ్ తదితరులు పాల్గొన్నారు