సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం…

Palabhishek for CM Revanth Reddy's photo...
Palabhishek for CM Revanth Reddy's photo...

ఝరాసంగం : మండల పరిదిలోని బర్దిపూర్ గ్రామ ఉపాధి హామీ కూలీలు సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాల అమలులో భాగంగా బర్దిపూర్ గ్రామాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బర్దిపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలకు ఆత్మీయ భరోసా క్రింద 77 మంది ఎంపిక కాగా వారి ఖాతాలలో రూ. 6 వేల చొప్పున నగదు ప్రభుత్వం జమ చేయడంతో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి అంటూ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

గ్రామంలో నాయకులు, మహిళలు సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి 592 మంది రైతులకు రైతు భరోసా క్రింద రు.67 లక్షలు జమ చేయడం జరిగిందన్నారు. గ్రామంలోని 303 ఇందిరమ్మ ఇళ్లు, దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు మంజూరయ్యాయాన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను అధికారులు సిద్ధం చేశారని పేర్కొన్నారు. బర్దిపూర్ గ్రామాన్ని ఎంపిక చేయడంపై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్, సీనియర్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.