నేషనల్ హైవే పై నేత్రాల చూపు అటు ఇటు
నిఘా ను నిర్బంధించలేకపోతున్నా సీసీ కెమెరాలు
పట్టింపులేని అధికారులు నాయకులు
సిరి న్యూస్/ గుమ్మడిదల రూరల్
ప్రధాన రహదారి 765 డి ప్రమాదం జరిగితే తెలియడంతో పాటు అసాంఘిక సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ లోపంతో ఆ సీసీ కెమెరాలు ఎందుకు పనికిరాకుండా పోయినాయి వివరాలకు వస్తే ప్రధాన రహదారి 765 డి పైన అన్నారం దోమడుగు బొంతపల్లి గుమ్మడిదల గ్రామాల వరకు సీసీ కెమెరాలను హెడ్లైట్లకు ఏర్పాటు చేశారు ప్రస్తుతం వాటికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎటు చూస్తున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఎదురవుతున్నాయి. రోడ్డుపైన పోయే వాహనాలను నిర్బంధించేది పోయి ఆకాశం వైపు భూమి వైపు చూస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఎందుకు పనికి రాకుండా పోయినాయి. వాటికి తోడు హెడ్లైట్లకు నాయకుల బ్యానర్లను కట్టడం వలన కూడా కనిపించకుండా పోతున్నాయి సీసీ కెమెరాలు ఉన్నచోట అటూ ఇటూ రెండు వైపులా బ్యానర్ కట్టి కేంద్రాలు వాహనాలను రికార్డ్ చేయలేకపోతున్నాయి. వాటి పర్యవేక్షణను ఎవరు చూస్తున్నారో ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడింది. లక్షలాది రూపాయలను వెచ్చించి ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటిని పట్టించుకునే వారే కరువైనారు.
గ్రామపంచాయతీలో అది దుస్థితి గ్రామ పంచాయతీల నుండి లక్షలాది రూపాయలు డబ్బులను తీసి సీసీ కెమెరాలను కొనుగోలు చేసి గ్రామాలలోని ప్రధాన కూడలిల వద్ద ఏర్పాటు చేశారు. కానీ వాటిని పర్యవేక్షణ లోపం కారణంగా ఎందుకు పనికిరాకుండా పోయినాయి లక్షలాది రూపాయల డబ్బులు వృధా అవుతున్నారు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ పంచాయతీ పర్యవేక్షణ లేకపోవడం వల్ల వాటి పరిస్థితి ధైర్యంగా మారినాయిఈ సీసీ కెమెరాలు ఎవరి పర్యవేక్షణలో అర్థంకాక వాటిని పట్టించుకునే వారు లేక ఎందుకు పనికిరాకుండా పోయినాయి