– విహెచ్ పి రాష్ట్ర సహా సంపర్క్ ప్రముఖ రామ్ రెడ్డి
పెద్ద శంకరంపేట[Padda Shankarampet], (సిరి న్యూస్):
స్వాతంత్ర సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలు చిరస్మరణీయమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహా సంపర్క ప్రముఖ రామ్ రెడ్డి అన్నారు. గురువారం నేతాజీ జయంతి పురస్కరించుకొని పెద్ద శంకరం పేట లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని నేతాజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన తో పాటు మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మండల బిజెపి అధ్యక్షుడు కోణం విఠల్, శిశు మందిర్ ప్రబంధకారిని సభ్యులు తదితరులు కూడా పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా రామ్ రెడ్డీ మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామ ఉద్యమంలో దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోయాయన్నారు. భారతదేశ స్వాతంత్రం కోసం నేతాజీ ఆజాద్ హిందూ ఫౌస్ సంస్థను ఏర్పాటు చేసి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. ప్రస్తుత యువత విద్యార్థులు ఆయన సూచించిన మార్గంలో పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మండల బిజెపి అధ్యక్షుడు కోణం విఠల్, శిశు మందిర్ ప్రబంధ గారిని సభ్యులు జంగం రాఘవులు, బొడ్ల ప్రకాశం, ప్రధానాచార్యులు వీరప్ప, ఆర్ఎస్ఎస్ బాధ్యులు జైహింద్ రెడ్డి, సీతారామారావు, రవి వర్మ, బుగుడాల కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆర్ వి ఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేటలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పేట ఎస్ఐ శంకర్, ఆర్ వి ఎస్ అధ్యక్షులు గంగారెడ్డి, గాండ్ల సంగమేశ్వర్, హరికిషన్, నరసింహ చారి, సంగమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.