వివాహిత. మహిళ అదృశ్యం.

చిన్న ఘనపూర్ లో ఘ‌ట‌న‌
భ‌ర్త వేదింపులు త‌ట్టుకోలేక ఇంటి నుంచి వెళ్లిపోయిన జ్యోతి

కొల్చారం:ఓ వివాహిత అదృశ్యమైన ఘటన.. కొల్చారం మండల పరిధిలోని చిన్న ఘనపూర్ లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చాకలి జ్యోతి (26)కి ప‌దేళ్ల క్రితం పెళ్ల‌య్యింది. న‌లుగురు కొడుకులకు జ‌న్మ‌నివ్వ‌గా ఇద్ద‌రు కొడుకు మృతిచెందారు. తన భర్త చాకలి శ్రీనివాస్.. నిత్యం మద్యం సేవించి భార్య జ్యోతిని వేదించే వాడని.. ఈ క్రమంలో వేధింపులు ఎక్కువ కావడంతో ఇంటినుంచి వెళ్లిపోయింది. ఆచూకి తెలవ‌క‌పోవ‌డంతో జ్యోతి బాబాయి కొల్చారం పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు.