అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన అయ్యప్ప దేవాలయం
పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.
భజన పాటలు, భక్తి గీతాలు, సంకీర్తనలు ఆలపించిన అయ్యప్ప స్వాములు
సదాశివపేట జనవరి 1 సిరి న్యూస్ : స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప నామస్మరణం తో అయ్యప్ప దేవాలయం మారుమోగింది. సదాశివపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోదరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ గురు స్వామి ఆధ్వర్యంలో 29వ మహా పడిపూజ కార్యక్రమం అరుణ్ గురు స్వామి ,కాజు గురుస్వాముల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం సదాశివపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొని అయ్యప్ప స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి దేవాలయం అయ్యప్ప నామస్మరణతో మారు మోగింది. అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణం, భజన పాటలు, భక్తి గీతాలతో అయ్యప్ప నామ సంకీర్తనలు ఆలపించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు, మాజీ జెడ్పిటిసి చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, బర్దిపూర్ అప్ప గారు, నాయకులు శివకుమార్, మధుసూదన్ రెడ్డి, పట్నం మాణిక్యం, ప్రజా ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.