జనవరి 23 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
స్వాతంత్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128 వ జయంతి సందర్బంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రం నేతాజీనగర్ లో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహనికి పూల మాల వేసి నేతాజీ సేవలు కొనియాడిన ఫోరమ్ నాయకులు. ఈ సందర్బంగా ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ, భారత స్వాతంత్ర ఉద్యమం లో బ్రిటిష్ రాజ్యనికి వ్యతిరేకంగా దిటుగా ఎదుర్కొడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమం లో వేలాది యువత పాల్గొనేలా దేశ యువత కు చైతన్యం కల్పించిన వీర పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. నేతాజీ పోరాట వ్యూహల ద్వారా బ్రిటిష్ పాలకులను కంగుతినిపించి భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్ర లో కీలక పాత్ర పోషించారన్నారు. నేటి యువత యువత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్య సాహసలను, జీవిత చరిత్ర ను స్ఫూర్తి గా తీసుకోని నేడు సమాజం లో ఉన్న సమస్య లా పోరాటం చేయాలన్నారు. ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, కార్యవర్గ సభ్యులు చాకలి మల్లేశం, మేకల రామస్వామి నేతాజీ యువ సేన నాయకులు శివంగుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.