రామాయంపేట[ramayampet] జనవరి 31 (సిరి న్యూస్)
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాల్లో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా దామరచెరు గ్రామాన్ని ఎన్నికలు చేసినప్పటికీ అర్హులకు ప్రాధాన్యత ఇవ్వలేదని దామరచెరువు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ నీల రాజు ఆరోపించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకాలు ఎంపిక చేయడంలో కమిటీ సభ్యులతో పాటు పార్టీ నాయకులు సైతం తమకు అందుబాటులో మరియు నచ్చిన వారికి మాత్రమే లిస్టులో పేర్లు చేర్చడం జరిగిందని ఆయన ఆరోపించారు. అర్హులు కాకుండా అనర్హులకు ఈ పథకాలు అమలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం పార్టీలో కచ్చితంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి కానీ పార్టీ కార్యకర్తలు నాయకులు వారి ఆధీనంలో ఉండే వారికి వర్తించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన అంటే నిజమైన అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడడమే లక్ష్యం అన్నారు. ఈ విషయంలో దామరచెరువు గ్రామానికి చెందిన అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ విషయంలో పాలకులతో పాటు అధికారులు విచారణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.