సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాదుల పవన్ కుమార్
చింతమడక, మల్యాల టీంల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్
విన్నర్‌గా నిలిచిన మల్యాల టీం..మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా రమేశ్
విజేతలకు బహుమతులను ప్రధానం చేసిన సాదుల పవన్ కుమార్
సిద్దిపేట:సిద్దిపేట్ మినీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ కప్–2024 సీజన్ 1ను కాంగ్రెస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం చింతమడక, మల్యాల టీంల మధ్య మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ లో మల్యాల టీం విన్నర్ గా నిలిచింది. ఈ టోర్నీకి ముఖ్య అతిధిగా విచ్చేసిన సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాదుల పవన్ కుమార్ మ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రమేశ్ (మల్యాల టీం)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షీల్డ్ ను అందజేశారు.
ఈ సందర్భంగా సాదుల పవన్ కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా క్రీడా ప్రేమికుడు, క్రీడాకారుడని చెప్పారు. యువత చెడుసావాసాలకు అలవాటు కాకుండా ఉండేందుకు క్రీడలను ప్రోత్సహించే అనేక చర్యలు చేపట్టారని చెప్పారు. సీఎం రేవంత్ క్రీడలకు కనీవినీ ఎరుగని స్థాయిలో నిధులు కేటాయించారని తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెతికి తీయడమే ప్రభుత్వం ధ్యేయమన్నారు. క్రీడాకారులు జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయ. అనంతరం విజేతలుగా నిలిచిన జట్లు, క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివ, నరేష్ ,నాగేష్ , చిర్రం. ఆంజనేయులు, అఖిల్, క్రీడాకారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.