ఛలో సిద్దిపేట

Chalo Siddipet

29-01-2025 సిరి న్యూస్ జోగిపేట[jogipet]:
తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల ద్వితీయ రాష్ట్ర మహాసభలకు బయలుదేరిన ఆటో యూనియన్ మరియు భవన నిర్మాణ కార్మికులు.సభలను ఉద్దేశించి అటో యూనియన్ అధ్యక్షులు మొగులయ్య గారు బట్ట నరసింహులు గారు మాట్లాడుతూ బీహార్ యూపీ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో కూలి వ్యవస్థను దెబ్బతీస్తున్నారు దీని వలన తెలంగాణలో ఉన్న కూలీలు కార్మికులు నష్టపోతున్నారని ఆయన చెప్పారు మరియు ఉచిత బస్సు ఉచిత బస్సు కారణంగా ఆటో కార్మికులు తమ జీవన ఉపాధిని కోల్పోవడం జరుగుతుంది దీనికి నిరసన తెలుపుతూ ఈరోజు జరిగే ద్వితీయ మహాసభలకు మద్దతు తెలపడానికి వారు తమ వంతు నినాదాన్ని వినిపించడానికి బయలుదేరి వెళ్తున్నారు ఇందులో ఆటో యూనియన్ అధ్యక్షులు బే గారీ మొగులయ్య ,బబ్లు, మరియు బట్ట నరసింహులు , కుమ్మరి గోపాల్ ,వనంపల్లి రాములు, రొయ్యల రాజు, నాదలాపురం పాపయ్య ,జంగం గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు