-సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడిన కలెక్టర్ వల్లూరి కాంత్రి
-జిల్లాలోని పలువురు మహిళా ఉపాధ్యాయులకు సన్మానం
సంగారెడ్డి[SANGAREDDY] : ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం గా ప్రకటించింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం జనవరి రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పండుగలా నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోజాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ , డిఆర్ఓ శ్రీమతి పద్మజ , జిల్లా విద్యాధికారి ఎస్ వెంకటేశ్వర్లు సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్లు, జిల్లా సైన్స్ అధికారి జిల్లాలోని పలు పాఠశాలల నుంచి హాజరైన మహిళా ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.సంఘ సంస్కర్త , తొలి మహిళా గురువు సావిత్రిబాయి పూలే విద్యా రంగానికి చేసిన సేవలను కొనియాడారు. ఈసందర్భంగా జిల్లాలోని పలువురు మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించడం జరిగింది .జిల్లాలోని అన్ని పాఠశాలలలో ప్రభుత్వ ఆదేశానుసారం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.