పెద్దమ్మ తల్లి దేవాలయాల నిర్మాణంతో.

with-the-construction-of-peddamma- talli-temples
with-the-construction-of-peddamma- talli-temples

ముదిరాజులలో ఐక్యత పెరుగుతుంది…
శాసనం మండలి డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ ముదిరాజ్…
మనోహరాబాద్, ఫిబ్రవరి 3. సిరి న్యూస్.
ముదిరాజుల ఆరాధ్య కుల దైవమైన పెద్దమ్మ తల్లి దేవాలయాల నిర్మాణంతో ముదిరాజులలో ఐక్యత పెరుగుతుందని శాసనమండలి డిప్యూటీ స్పీకర్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో ముదిరాజుల ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆలయ గర్భగుడి, అంతరాలయం గడపల ప్రతిష్టాపన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ తో పాటు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని ఘనంగా పూజ నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ముదిరాజుల సంఖ్య పెరిగిందని ఇందుకోసం గ్రామ గ్రామాన పెద్దమ్మ తల్లి దేవాలయాలను నిర్మిస్తున్నారని, దీంతో ముదిరాజులలో ఐక్యత పెరిగిందని ఆయన గుర్తు చేశారు. సంఘం సభ్యులకు కోరిక మేరకు తనకు వచ్చే ఎమ్మెల్సీ కోటా కింద రూ. 10 లక్షల నిధులతో గ్రామంలో ముదిరాజ్ మినీ ఫంక్షన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని బండ ప్రకాష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకుడు కొట్టాల యాదగిరి, సంఘం అధ్యక్షుడు కరాటే మల్లేష్, సభ్యులు నరేష్, శ్రీశైలం, బాలరాజు, సత్యనారాయణ, రాజు, నాగరాజు లతోపాటు బిజెపి రాష్ట్ర నాయకుడు నత్తి మల్లేష్ ముదిరాజ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చిటుకుల మహిపాల్ రెడ్డి, ఉమ్మడి మండల సొసైటీ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు జావిద్ పాషా, గణేష్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు నాగభూషణం, కూచారం నరేష్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజుల బిసి-డి కోసం ఇక ఉద్యమమే…

ముదిరాజుల హక్కుల సాధన కోసం, బీసీ ఏ లో ఉన్న ముదిరాజ్ లను బీసీ డీలోకి మార్చడానికి ప్రభుత్వంపై ఇక ఉద్యమం తప్పదని శాసనమండలి డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి ముదిరాజ్లను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమం చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు జరిగిన ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో 6వేలకు పైగా ముదిరాజ్ సంఘాలను మత్స్యకార సొసైటీలో చేర్చామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో హైదరాబాదులో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి కోట్ల రూపాయలు విలువచేసే ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించుకున్నామన్నారు. త్వరలోనే భవన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.