మీ కుటుంబాల‌కు అండ‌గా ఉంటా..

Will support your families..
Will support your families..

మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి
మృతి చెందిన కాంగ్రెస్ నాయ‌కుల కుటుంబాల‌కు ప‌రామ‌ర్శ
కొల్చారం[kolcharam], జ‌న‌వ‌రి 16 సిరి న్యూస్
కొల్చారం మండల పరిధిలోని యనగండ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్ల సతీష్ తండ్రి వడ్ల నారాయణ గత నెలలో మరణించిన విషయం తెలిసి గురువారం గ్రామానికి వెళ్లి వారి కుమారుడు సతీష్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్. మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి మల్లేశం గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్ ప‌రామ‌ర్శించారు. వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. ఈసంద‌ర్భంగా మ‌ద‌న్ రెడ్డి, స‌హాసిని రెడ్డి మృతుల‌కు కుటుంబ స‌భ్యుల‌కు అండ‌గా ఉంటాన‌ని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షులు ట్రెజరర్ మధుసూదన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రవితేజ మన్నకిష్టయ్య భూపాల్ రెడ్డి. మాజీ సర్పంచ్ లక్ష్మి నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు