నేను యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయకున్ని..
నాపై ప్రజలకు విశ్వాసం ఉంది.. నేను హార్డ్‌వర్క్ చేస్తానని నమ్ముతున్నారు
నేను గెలిస్తే పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా
సిరి ప్రతినిధితో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ కుమార్ ముఖాముఖి
చేగుంట, జనవరి 7 సిరి న్యూస్
సిరి ప్రతినిధి: మీ రాజకీయ ప్రస్తావన ఎలా మొదలైంది?
నవీన్ కుమార్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసినటువంటి చెరుకు ముత్యం రెడ్డి శిష్యుడిగా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది.
సిరి ప్రతినిధి: ప్రస్తుతం మీరు మండల ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా.. మీ కార్యకర్తలు, మీ నాయకత్వంపై సంతృప్తి కరంగా ఉన్నారా..
నవీన్ కుమార్ :ఉన్నారు. మా మండల పార్టీ నాయకులు, సినీయర్ నాయకులు అందరం కలిసి మెలిసి ఉంటాం. మండలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నిల్లో వందశాతం ఫలితాలు సాధిస్తాం.
సిరి ప్రతినిధి: మీ పదవి కాలం లో సంతృప్తి ఇచ్చిన అంశం?
నవీన్ కుమార్ :మండలం ఉన్న ప్రభుత్వ పాఠశాల లో , చేగుంట, నర్సింగ్ లలో సిఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ లు ఇవ్వడం నాకు సంతృప్తినిచ్చే అంశం
సిరి ప్రతినిధి: మీ పట్టణం లో ఇంకా చేయాలిసిన పనులు ఏమిటి?
నవీన్ కుమార్ :నా దృష్టిలో ఉన్నవయితే కూరగాయల మార్కెట్, డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి.
సిరి ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా, చేస్తే మీ ఎజెండా ఏమిటి,
నవీన్ కుమార్ :వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను.నేను కాంగ్రెస్ పార్టీ లో ఉన్నాను. రాష్టం లో అధికారం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అది నాకు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా మా చెరుకు శ్రీనివాస్ అన్న సహకారం ఉంది. నేను గెలిస్తే పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా.
సిరి ప్రతినిధి: మిమ్మల్ని ఎందుకు ప్రజలు గెలిపించాలి?
నవీన్ కుమార్ :పట్టణం లో, మండలం లో నవీన్ మంచి హార్డ్ వర్క్ చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో ఉంది., యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిని, నాపై ప్రజల్లో విశ్వాసం ఉంది.
సిరి ప్రతినిధి: ప్రస్తుతం ప్రభుత్వ పాలనా పై మీ అభిప్రాయం?
నవీన్ కుమార్ :చాలా బాగుంది. ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రభుత్వం 6 హామీలు అమలు చేసింది. రాబోయే రోజులలో ఇంకా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతాయి.