‘సిరి’ ముఖాముఖితో యువనేత సాదుల పవన్ కుమార్
* నాపై ప్రజలకు విశ్వాసం ఉంది.. నేను కష్టపడి పని చేస్తానని నమ్ముతున్నారు.
* పార్టీలో కష్టపడ్డ పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది
* నన్ను గెలిపిస్తే మండాలన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా..
* సిరి ప్రతినిధితో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాదుల పవన్ కుమార్ తో ముఖాముఖి
ప్రజలకు సేవ చేయాలనే లక్షంతో రాజకీయాల్లోకి వచ్చాను. నాయకులను, కార్యకర్తలను ఏకతాటిపై తీసుకువచ్చి పార్టీని బలోపేతం చేయడంలో అహర్నిశలు కష్టపడుతాను. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాను. గెలుపొందిన తరువాత చేపట్టే పనులను సైతం ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవడం జరిగిందని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాదుల పవన్ కుమార్ తెలిపారు.
సిరి ప్రతినిధి: మీ రాజకీయ ప్రస్తావన ఎలా మొదలైంది?
పవన్ కుమార్: స్టూడెంట్ గా ఉన్నప్పడు నుంచే రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది. క్రమంగా రాజకీయ నాయకుల ప్రసంగాలను వినడం, పొలిటికల్ న్యూస్ చదవడం అలవాటుగా మారింది.ఈ క్రమంలో సమాజంలో గౌరవంగా బ్రతుకుతూ.. నలుగురికి సహాయపడాలని నిర్వహించుకున్నా. ఈ రోజుల్లో యువత డాక్టర్ కావాలో..ఇంజనీర్ కావాలనో, సాప్ట్ వేర్ ఎంప్లాయ్ కావాలనో లేదా బిజినెస్ మ్యాన్ కావాలనో అనుకుంటారు. కానీ, నేను మాత్రం చిన్నప్పటి నుండి ప్రజ నాయకుడిని కావాలని నిర్ణయించుకున్నా.. నలుగురికి సహాయపడేలా ఉండాలని, సమాజానికి సేవ చేయాలని ఫిక్స్ అయ్యా.
సిరి ప్రతినిధి: ప్రస్తుతం ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ?
పవన్ కుమార్: చాలా బాగుంది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రగతి బాటలో ప్రయాణిస్తుంది. ఆరు గ్యారంటీ అమల్లో సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనను చూపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఒకే విడతలో రూ 2 లక్షల వరకు రైతు రుణ మాఫీ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, వ్యవసాయానికి ఉచిత కరెంటు వంటి హామీలను నెరవేర్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుంది . రాబోయే రోజులలో ఇంకా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతాయి.
సిరి ప్రతినిధి: ప్రస్తుతం మీరు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కదా.. మీ కార్యకర్తలు, మీ నాయకత్వంపై సంతృప్తికరంగా ఉన్నారా ?
పవన్ కుమార్: నా నాయకత్వంపై మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, సీనియర్ కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నారు. అన్ని విషయాలలో నాకు సహకరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అలాగే మండల స్థాయిలో అభివృద్ధి పనులకు ప్రణాళికలను సిద్ధం చేయడంలోనూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలోనూ కార్యకర్తలు ముందుంటున్నారు. వచ్చే స్థానిక ఎన్నికలలో 100% కాంగ్రెస్ నాయకులే సర్పంచులు గా ఎన్నిక అయితారనే నమ్మకం ఉంది.
సిరి ప్రతినిధి: మీ మండానికి ఇంకా చేయాలిసిన పనులు ఏమిటి?
పవన్ కుమార్: గత ప్రభుత్వం నంగునూరు మండలం కేంద్రాన్ని అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మండల కేంద్రంలో మౌళిక, ఉపాధి సదుపాయాలను కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. దీంతో నంగునూరు మండలంలో ఉపాధి లేక ఇక్కడి ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. కొంతమంది దినసరి కూలీలుగా సిద్దిపేట, చేర్యాల లాంటి ప్రాంతాలకు వెళ్లి పనులు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో మండలం కేంద్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేలా.. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను, ఇతర ఉపాధి మార్గాలను కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు పార్టీ పెద్దలతో చర్చించి.. ప్రణాళికలను సిద్ధం చేస్తాం.. మా మండల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం.
సిరి ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా, చేస్తే మీ ఎజెండా ఏమిటి?
పవన్ కుమార్: వచ్చే స్థానిక ఎన్నికలలో సర్పంచ్ గా పోటీ చేస్తా.. పార్టీ అవకాశమిస్తే ఖచ్చితం జడ్పీటీసీ గానూ ఎన్నికల్లో పోటీ చేస్తాను. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ గారు, కొండ సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గార్లు ఆశీస్సులు ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గం ఇన్చార్జి సోదర సమానులు పూజల హరికృష్ణ అన్నగారి సపోర్టు ఉంది. హరికృష్ణ అన్న ప్రతి విషయంలో నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. ఆయన నిత్యం ప్రజల క్షేమం కోసం, వారి బాగోగుల కోసం పరితపిస్తాడు. అవసరమైతే.. వారి కోసం డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా నిర్ణయాలు తీసుకుంటారు. హరికృష్ణ అన్నగారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ..వారి నాయకత్వంలో పార్టీలో సేవాలందిస్తున్నా.. అలాగే.. కాంగ్రెస్ పార్టీ పెద్దలు, జిల్లా నాయకుల మద్దతు కూడా ఉంది.
సిరి ప్రతినిధి: మీరు రాజకీయాల్లోకి స్వతహాగా వచ్చారా? మీకు ఎవరు ఆదర్శంగా తీసుకుని వచ్చారా ?
పవన్ కుమార్: నాకు రాజకీయాల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆదర్శం. దేశానికి సాఫ్ట్‌వేర్, టెలికమ్యూనికేషన్ రంగాలను పరిచయం చేసిన ఘనత ఆయనదే. దేశాభివృద్ధికి యువత కీలకమని గుర్తించారు. నేడు భారత దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే.. ఆ రోజు రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలే కారణం. అలాగే.. నేడు యువత రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారంటే.. భావి ప్రధాని, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కారణం, అలాగే బీఆర్ఎస్ కంచుకోట ను బద్దలగొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదర్శం. అలాగే మా నాన్న (సాదుల ఆత్మరాములు) గారు నాకు రోల్ మోడల్. మా నాన్న గారు ఎన్ఎస్ యూఐ(NSUI)యూత్ కాంగ్రెస్, DCC జనరల్ సెక్రెటరీగా పార్టీకి పలు సేవలందించారు.అలాగే గతంలో ప్రభుత్వం న్యాయవాది, సీడబ్యూసీ మెంబర్ గా సేవలందించారు. మా నాన్నగారి బాటలో నేను కొనసాగాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఎల్.ఎల్.బీ. చేస్తున్నా.. అలాగే..మా అమ్మగారు సాదులరాణి కూడా నంగునూర్ గ్రామ సర్పంచ్ గా సేవలందించారు.