మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల స్వామి[Buddula Swami]
ఎస్సీ ఉపకులాల
హక్కులపోరాట సమితి..
సిరి /న్యూస్ జనవరి 25 మెదక్ రూరల్[Medak rural]
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సూచిస్తూ, ఇది ఆర్టికల్ 341కి భిన్నమైనది కాదని తీర్మానిస్తూ, ఆర్టికల్స్ 14, 15(4), 16(4) ప్రకారం
వర్గీకరణ చేయాలని పోరాడే మాదిగలు మిగతా అత్యంత వెనుకబడ్డ 57 దళిత కులాల వాటా ఎంతో స్పష్టం చేయరు. వర్గీకరణ వద్దు అనే మాలలు ఇంతకాలం వెనుకబడ్డ మా 57 కులాల అభివృద్ధి కోసం ఏం చేశారో, భవిష్యత్‌లో వారికి ఎలాంటి అవకాశాలుండాలో చెప్పరు. షెడ్యూల్డ్ కులాల జాబితాలోని కులాలన్నీ ఎవరికి వారు స్వతంత్ర కులాలైనప్పటికి ఈ రెండు కులాలు మిగతా 57 కులాలను తమ ఉపకులాలుగా ప్రచారం చేసుకొని 57 కులాల ప్రయోజనాలను కూడా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
78 సంవత్సరాలుగా రాజ్యాంగబద్ధంగా దళితులకు లభించే ఫలాలను మాల మాదిగలే వారి జనాభా నిష్పత్తి కంటే అధికంగా అనుభవించారని జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్లు స్పష్టం చేసాయి. మాలలు మాదిగలకు అన్యాయం చేసారని వాపోతున్నారు కదా; మరి మిగతా 57 కులాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ రెండు కులాల చేతుల్లో ఎంత దోపిడీకి గురయ్యాయో ఆలోచించరా?
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మాదిగల జనాభా 34,87,872 (9.4శాతం) మాల జనాభా 14,35,613 (3.89శాతం) మిగతా 57 ఎంబిఎస్సీ కులాల జనాభా 15,21,099 (4.12శాతం). స్వరాష్ట్రంలో అమలు జరిగిన మూడెకరాల భూ పంపిణీ పథకంలో మాల మాదిగలకు 14,350 ఎకరాలు, కార్పొరేషన్ ఋణాలలో 93 శాతం, ఉద్యోగ అవకాశాలు 85 శాతం, దళిత బంధు పథకంలో 90 శాతం మాల మాదిగలే దక్కించుకున్నారు. మిగతా 57 కులాలకు ఒకటి రెండు శాతానికి మించింది లేదు. ఇవన్నీ లెక్కలు తీసి ఇప్పటివరకు ఫలాలు పొందని కులాలకు అధిక శాతం ఇవ్వాలి. వెనుకబడ్డ దళిత కులాలు ఏ కులానికీ ఉపకులాలు కావని, అవన్నీ స్వతంత్ర కులాలేనన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఉపకులాలు అనే పదాన్ని వాడవద్దు. వారిని మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎమ్‌బిఎస్సీ)గా గుర్తించాలి.ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి 57 ఎంబిఎస్సీ కులాల తరఫున చేస్తున్న ముఖ్య సూచనలు కొన్ని ఉన్నాయి: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయాలి. ఈ 57 కులాలూ మాల మాదిగ కులాలతో పోటీపడలేవు కాబట్టి వారి గ్రూపులలో వీరిని కలుపవద్దు. అవసరమైతే మా 57 కులాలలోనే నిరుపేదలను ఎ–గ్రూపులో, పేదలను బి– గ్రూపులో చేర్చి అధికశాతం రిజర్వేషన్లు కేటాయించాలి. అభివృద్ధి చెందిన మాల మాదిగలను సి– గ్రూపులో కానీ లేదా సి, డి గ్రూపులలో కానీ చేర్చాలి. ఎస్సీ వర్గీకరణను జనాభా దామాషా ప్రకారం కాకుండా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ‘దళిత కులాల ఎంపరికల్ డేటా ప్రకారం’ చేయాలి. అత్యంత వెనుకబడ్డ 57 కులాలకు ప్రస్తుతం అమలు చేస్తున్న 15శాతం రిజర్వేషన్లలో 7శాతం కేటాయించాలి. మా కులాలకు కేటాయించబడే అవకాశాలను మా కులాలతోనే భర్తీ చేయాలి. అర్హులు లేకుంటే బ్యాక్‌లాగ్ చేయాలి. అంతేకానీ, మాల, మాదిగ గ్రూపులకు క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. లేదా తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల తరహాలో మా 57 దళిత కులాలకు ప్రత్యేక శాతాన్ని కేటాయించి చట్టబద్ధత కల్పించాలి. లేదా ఎస్సీ రిజర్వేషన్లను రాష్ట్రంలో 22 శాతానికి పెంచి అత్యంత వెనుకబడ్డ 57 దళిత కులాలకు 10శాతం కేటాయించి మిగిలిన 12 శాతం మాల మాదిగ కులాలకు కేటాయించాలి. ఎస్సీ వర్గీకరణకు జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవాలనుకుంటే 2011 లెక్కలు కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే నూతన జనాభా లెక్కలు -2025లో నిర్వహించి వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి.
ఎందుకంటే గత పదేళ్ళ క్రితం దళిత కులాలు ఎవ్వరూ వారి కులం సమగ్ర వివరాలు అందులో నమోదు చేసుకోలేదు. కాబట్టి ఆ పాత లెక్కలు తీసుకుంటే దళితుల్లో వెనుకబడ్డ 57 కులాలు తీవ్రంగా నష్టపోతాయి. దళితుల్లో అత్యంత వెనుకబడ్డ 57 కులాలకు సెకండరీ విద్య, జిల్లా స్థాయి ఉద్యోగాలు, ఉపాధి సంక్షేమ పథకాల్లో జిల్లాని యూనిట్‌గా తీసుకొని వర్గీకరణను అమలు చేయాలి. ఇంకా ఉన్నత సాంకేతిక విద్య, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు, రాజకీయ అవకాశాల్లో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని వర్గీకరణ అమలు చేయాలి. 57 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి వెయ్యి కోట్లు కేటాయించాలి. దళిత కులాలందరికి కుల ధ్రువీకరణ పత్రాలు ఆర్డీవో ద్వారా కాకుండా తహశీల్దార్ ద్వారానే ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా ఉపాధి సంక్షేమ పథకాలలో, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో, భూమి పంపిణీలో మా 57 కులాలకు మొదటి ప్రాధాన్యతనివ్వాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో, నామినేటెడ్ పదవుల్లో 7 శాతం స్థానాలు కేటాయించాలి.
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ 57.MBSC. తెలంగాణ రాష్ట్ర జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి మాస్టీ హక్కుల పోరాట సమితి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీ బుద్దుల స్వామి