ఈ నెల 20 వరకు అర్హుల జాబితా పూర్తి చేయాలి
జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్ రాహుల్ రాజ్
సిరి, మెదక్ [medak] ప్రతినిధి :
ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా పథకాలు జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు జాబితా ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.శనివారం నాడు సీఎం ఆదేశాల మేరకు జిల్లా అధికారులతో జిల్లాలో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం సర్వే జిల్లాలో 96% పూర్తి చేయడం జరిగిందని అర్హత గల నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం పగడ్బందీగా అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. రైతుల సంక్షేమం, నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల ప్యూరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. రైతు భరోసా పథకంలో అర్హులైన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో సమీక్షించి, లబ్ధిదారుల పేర్లను జాబితాలో చేర్చాలన్నారు. ప్యూరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించి 20వ తేదీ నాటికి పూర్తిచేయాలన్నారు. 21వ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి, తుది జాబితా ఆధారంగా లబ్ధిదారులను ఖరారు చేయాలన్నారు. ప్రతి మండలాన్ని రెండు భాగాలుగా విభజించి, ప్రతి భాగానికి డిప్యూటీ తహసీల్దార్‌ను బాధ్యత వహించాలని సూచింస్తూ సరైన పద్ధతిలో సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు జయచంద్ర రెడ్డి ,రమాదేవి, మైపాల్ రెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ యాదయ్య, డిఎస్ఓ సురేష్, అగ్రికల్చర్ అధికారి వినయ్ ,హౌసింగ్ పిడి మాణిక్యం హౌసింగ్ డి ఈ లు, ఈ ఈ లు , ఎంపీడీవోలు, వ్యవసాయ శాఖ ఏడీలు, ఏవోలు తదితరులు పాల్గొన్నారు