అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

welfare-schemes-for-everyone-who-is-eligible
welfare-schemes-for-everyone-who-is-eligible

కొల్చారం,[kolcharam] జ‌న‌వ‌రి 24 సిరి న్యూస్ః
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరెల్లి అనిల్ అన్నారు శుక్రవారం పైతర గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ అధికారులు నిర్వహించడం జరిగింది, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు భరోసా ఇద్దరమ్మా ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల మంజూరు కోసం తెలంగాణ ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తూ పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంతో ముందుకెళ్తుందని వారు తెలిపారు, ఎలాంటి వ్యవసాయ భూమి లేకుండా 2023-2024లో కనీసం 20 రోజులపాటు ఉపాధి హామీల్లో పనులు చేసి ఉన్న వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ 12000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పంపిణీ చేయడం గొప్ప విషయం అన్నారు రైతు భరోసా కింద ఈనెల 26వ తేదీ నుండి రైతుల అకౌంట్లో డబ్బులు వేయడానికి ప్రభుత్వం సంకల్పంతో ఉందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శ్వేత కుమారి, ఏఈఓ రోజా, పంచాయతీ కార్యదర్శి మహేష్, కానిస్టేబుల్ మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుమ్మరి భూమయ్య యాదవ రెడ్డి కుమ్మరి శివకుమార్ కార్తీక్ రాజ్ మాడబోయిన శేఖర్ బోయిని అంతయ్య పుట్టి శివ కుమ్మరి ప్రవీణ్ దూదేకుల ఇబ్రహీం షాదుల్లా మరెల్లి ప్రభాకర్ సొంగ గణేష్ చిప్ప రాజు పాల్గొన్నారు.