-మెదక్ [medak]ఆర్ డి ఓ రమాదేవి..
పెద్ద శంకరంపేట,[PeddaShankarampet] జనవరి 21 (సిరి న్యూస్):
అర్హులైన వారందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని మెదక్ ఆర్ డిఓ రమాదేవి అన్నారు. మంగళవారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని ఆరేపల్లి, బూరుగుపల్లి, జముల నాయక్ తండ.. బద్దారం గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించారు. ఆరేపల్లి లో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ గృహాలు, తదితర పథకాలకు సంబంధించి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహ సిల్దార్ గ్రేసీ బాయ్, ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా, వ్యవసాయ అధికారి నాగం కృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమేష్, ఆయా గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.