కాంగ్రెస్ నాయకులు
సిరి ఫిబ్రవరి 4 హత్నూర [Hathnoora,]:
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని శేర్ ఖాన్ పల్లి శివారులో వెలసిన శ్రీ పలుగు పోచమ్మ ఆలయం వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను ఫారెస్ట్ ఆఫీసర్లు కూల్చివేయగా బాధితులను మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ల మంగళవారం పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. బ్రతుకుతెరువు కోసం చిరు వ్యాపారం చేసుకునే షెడ్లను కూల్చివేశారని న్యాయం చేయాలని కోరగా ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం చేయాలని కూల్చిన షెడ్లకు నష్టపరిహారం అందించేలా చూడాలని పలుగు పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ మల్ల గౌడ్ కోరారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు పలుకు పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కర్రే కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి, మాజీ చైర్మన్ సుదర్శన్ గౌడ్, మణిదీప్, హకీమ్, శేఖర్ గౌడ్, వరల నర్సింలు, బిక్షపతి, ప్రవీణ్ గౌడ్, బాబా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ సందీప్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు