మాజీ కౌన్సిలర్ నస్రిన్ నసీరుద్దీన్.
మాజీ కౌన్సిలర్ ను సన్మానించిన వార్డు ప్రజలు.
ఫిబ్రవరి 3.సదాశివపేట[sadashivapeta]. (సిరి న్యూస్)
సదాశివపేట పట్టణంలోని నాలుగవ వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ నశ్రీన్ నసీరుద్దీన్ ను ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శాలువా కప్పి పూలమాలతో సన్మానించడం జరిగింది.
వార్డు ప్రజలు మాట్లాడుతూ మా మాజీ కౌన్సిలర్ నస్రిన్ నసీరుద్దీన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వార్డును ఎంతగానో అభివృద్ధి పరిచారన్నారు.
మా వార్డులో మురికి కాలువలు రోడ్ల ఇబ్బంది చాలా ఉండేదని నసీన్ నసీరుద్దీన్ కౌన్సిలర్ అయిన తర్వాత ఐదు సంవత్సరాలలో వార్డు ఎంతగానో అభివృద్ధిని నోచుకుందన్నారు.ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నస్రిన్ నసిరుద్దీన్ మాట్లాడుతూ వార్డు ప్రజలు తను పదవిలో ఉన్నప్పటి నుంచి ఎంతగానో వార్డు ప్రజలు సహకరించారని వారి సహకారం వల్లనే నాల్గవ వార్డు అభివృద్ధి పథంలోకి దూసుకెళ్లిందన్నారు. వార్డు ప్రజలు తనకు కుటుంబ సభ్యులాంటివారన్నారు. నాలుగవ వార్డు ప్రజల దీవెనలు తనకు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు నర్సింలు, బాబేష్, కరీం, కామీల్,రహమత్, మోసిన్, ఖదీర్, మహబూబ్, షారు మరియు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.