ప్రజాస్వామ్య పరిరక్షణ పై పోరాటాలకు సిద్ధం కావాలి..

We need to prepare for the struggle for the protection of democracy.
We need to prepare for the struggle for the protection of democracy.

సిపిఎం పాలిటిబ్యూరో సభ్యులు బి వి రాఘవులు
సిద్దిపేట,[siddipet]జ‌న‌వ‌రి 20 సిరి న్యూస్ః 
కేంద్ర ,రాష్ట్ర విధానాల వలన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రజాస్వామ్య పరిరక్షణకై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యులు బివి ,రాఘవులు అన్నారు. సోమవారం సిద్దిపేటలో సిపిఎం కార్మిక కర్షక భవన్ ను సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకే ఓటు ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని దీనివలన ప్రాంతీయ పార్టీలకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. భవిష్యత్తులో డబ్బున్న వాళ్ళే సమాజాన్ని సాచించే అవకాశం ఉంటుందని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఎన్నిక ఒకే ఓటు విధానంపై పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ఎన్నో ఉద్యమాలు త్యాగాల ద్వారా లేబర్ చట్టాలను సాధించుకుంటే వాటన్నింటినీ కుదించి నాలుగు చట్టాలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇటువంటి చట్టాలు రాకుండా కార్మికులు కలిసికట్టుగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.నాలుగు లేబర్ కోడ్ చట్టాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్య పరిష్కారం కోసం కోర్టుకు వెళ్తామని నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అణాలోచిత నిర్ణయాలతో భవిష్యత్తులో రైతుల పరిస్థితి దయనీయంగా మారే అవకాశం ఉందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన వ్యవస్థ గాడి తప్పిందని ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు దెబ్బతిని పోతున్నాయని అన్నారు.
అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని దీనిపై ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు.దేశంలో రాష్ట్రంలో అత్యాచారాలు అక్రమాలు పెరిగిపోతున్నాయని దళితులపై అన్యాయం మైనార్టీలపై అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.బిజెపి పూర్తిగా మతసామరస్యాన్ని చెడగొడుతుందని విమర్శించారు.సిద్దిపేటలో కార్మిక కర్షక భవన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఈ భవనం పేద ప్రజలకు రైతులకు కార్మిక వర్గానికి అన్యాయానికి గురైన వారికి అండగా నిలబడాలని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సమస్య వస్తే కార్మిక కర్షక భవన్ వైపు చూసేలా పోరాటాలు నిర్వహించాలని తెలిపారు.సిద్దిపేటకు విచ్చేసిన బీవీ రాఘవులుకు సిపిఎం పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య,తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ సహాయ కార్యదర్శి పద్మశ్రీ, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు శోభన్, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్, రవికుమార్,భాస్కర్, ప్రశాంత్ ,అరవింద్, శిరీష ,నవీన, నక్కల యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.