మాలలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఆమోదించిన వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం..

We are opposing the classification bill passed in the assembly against Malas.

సంగారెడ్డి : మని సంగారెడ్డి జిల్లా కేంద్రం లో నిర్వహించిన నిరసన లో మాల సంఘాల నాయకులు తెలిపారు. రాజ్యాంగం కు విరుద్దంగా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వగా ఆ తీర్పుకు విరుద్దంగా ఎకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని, బిల్లును వెనక్కి తీసుకొని నిజంగా బడిమెట్లక్కని కుటుంబాలకు మేలు కలిగే విధంగా అనుభవపూర్వక వాస్తవిక డేటా సేకరించి కులవర్గీకరణ కాకుండా లబ్ది చేకూరని వారికి ప్రాధాన్యత నిస్తూ ఉపవర్గీకరణ చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన లో అందోల్ మల్లేశం మాల మహానాడు జిల్లా అధ్యక్షులు, tds మణి పటాన్చెరు డివిజన్ అధ్యక్షులు, రవీందర్ కొండాపూర్ మండలం అధ్యక్షులు, ఉద్యోగ సంఘాల నాయకులు అనంతయ్య, మొగులయ్య,లక్ష్మయ్య, తు్కారం, నర్సిములు మరియు యువజన సంఘాల నాయకులు ఉదయ్, సురేష్, సోషల్ మడియా ఇంచార్జి బేగరి పురుషోత్తం తదితరులు నిరసన కార్యక్రమము లో పాల్గొన్నారు .