
ఫిబ్రవరి 6 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
వీఆర్ఏలు 2022లో 80 రోజుల సుదీర్ఘ సమ్మె పోరాట ఫలితంగా గత ప్రభుత్వం జీవో నెంబరు 81, 85 లను విడుదల చేసింది. ఆ జీవో ని అనుసరించి రాష్ట్రంలో ఉన్న 20,555 మంది వీఆర్ఏ ల్లో 16,758 మంది వీఆర్ఏ లకు ప్రమోషన్స్ ఇచ్చి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. ఆ జీవోలో ఉన్న 3797 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి 19 నెలలు గడుస్తున్న నేటికీ వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. పలుమార్లు ముఖ్యమంత్రి రెవిన్యూ శాఖ మంత్రిని రెవెన్యూ అధికారులను కలిసి సమస్య విన్నవించిన అనేక నిరసనలు తెలిపిన ప్రభుత్వం సానుకూలంగా స్పందించని కారణంగా ఈరోజు వీఆర్ఏ వారసులు మినిస్టర్ కోటర్స్ కు వచ్చి శాంతియుతంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని కలిసి వీఆర్ఏల వారసుల గోడు తెలియజేయుటకు వస్తున్న వీఆర్ఏ లను మినిస్టర్ క్వార్టర్స్ వద్ద పోలీసులు వీఆర్ఏ లను అడ్డుకొని వారి చుట్టూ తాళ్లు పెట్టి నిర్బంధించారు.
మినిస్టర్ క్వార్టర్స్ వైపు వెళ్లకుండా మహిళలు వృద్ధుల నీ చూడకుండా పిడి గుద్దులు గుద్దుతూ రోడ్లపై ఈడ్చుకుంటూ లాఠీలతో కొడుతూ వాహనాలను ఎక్కించి హైదరాబాదులోని ఎస్సార్ నగర్ బోయినపల్లి జూబ్లీహిల్స్ బొల్లారం బండ్లగూడ చంద్రయనగుట్ట కాంచన బాగ్ వంటి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది. జీవో ఇచ్చి 19 నెలలు కావస్తుంది. ప్రభుత్వం విఆర్ఏ ల సమస్యల పరిష్కారం కోసం కమిటీని వేసి సంవత్సరం అవుతుంది ఇప్పటివరకు ప్రభుత్వం వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? రెవిన్యూ శాఖ మంత్రి సీసీఎల్ఏ వీఆర్ఏ వారసులతో ఎందుకు చర్చించడం లేదు సమస్య పరిష్కరించుటకు ప్రభుత్వం ఎందుకు సర్వ తీసుకోవడం లేదు? వీఆర్ఏలు 300 మంది పైగా మరణించిన అనేకమంది వీఆర్ఏ వారసులు ఆత్మ హత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇచ్చిన జీవుని ఎందుకు అమలు చేయకుండా అరెస్టులు చేయటం అన్యాయం. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు వీఆర్ఏలు మినిస్టర్ కోటర్స్ కు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటినని కలిసి తమ సమస్యలు వేడుకోవడం కోసం వస్తున్న వీఆర్ఏలను అడ్డుకొని దౌర్జన్యంగా అరెస్టు లు చేసి నిర్బంధించడని తెలంగాణ విఆర్ఎ జేఏసీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది.
ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వీఆర్ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి జీవో నెంబర్ 81,85 ప్రకారం వారసుల కి ఆర్డర్లు ఇవ్వాలని సీఐటీయు రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అరెస్టు చేసిన విఆర్ఎ లని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విఆర్ఎ జేఏసీ రాష్ట్ర కమిటీ కోరుతుంది.
జిల్లా నాయకుల పేర్లు కింది వరుసలో పెట్టండి
61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ సంగారెడ్డి అధ్యక్షులు రాజశేఖర్, జనార్ధన్,శంకర్, ఆంజనేయులు, ధనరాజ్, అశోక్, రాములు, చంద్రకాంత్,M ఆంజనేయులు, సురేష్, రాములు