నారాయణఖేడ్[Narayankhed]: జనవరి 25 (సీరి న్యూస్) ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధమని బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ శ్రీను అన్నారు. శనివారం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటు యొక్క ప్రాముఖ్యతను స్టూడెంట్స్ కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకుని శక్తివంతమైన భారతాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.