గ్రామసభ వద్ద గ్రామస్తుల నిరసనలు..

Villagers protest at the Gram Sabha.
Villagers protest at the Gram Sabha.

* రోడ్డు వెయ్యాలని డిమాండ్..
* చరవాణి ద్వారా కాంట్రాక్టర్ కు ఫోన్..

నిజాంపేట: గత రెండు సంవత్సరాల నుండి రోడ్డుపై కంకర పోసి వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామంలో గ్రామసభ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను సందయించి గ్రామసభ నిర్వహించిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో జరిగింది. ఈ మేరకు ప్రజా పరిపాలన గ్రామసభలలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభ వద్ద గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టి “రోడ్డు పనులు వెంటనే మొదలుపెట్టాలని” నినాదాలు చేశారు.

ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని నిరసన తెలుపుతున్న గ్రామస్తులను సంజయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల నుండి రోడ్డును అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని 12 రోజులుగా చేపట్టిన రిలే దీక్షకు ఎలాంటి స్పందన లేదంన్నారు. ప్రాణాలు పోతున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టనట్టు ఉంటున్నరనీ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టర్ కిసాన్ రావు తో చరవాణి ద్వారా మాట్లాడి ఫిబ్రవరి మొదటి వారం నుండి పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించినంతరం గ్రామసభ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, గ్రామ కార్యదర్శి మమత, నరసింహులు, ఏఈఓ శ్రీలత గ్రామస్తులు దుబాసి సంజీవ్, పాగాల ఎల్లం యాదవ్, బక్కన్నగారి నరేష్ గౌడ్, అజయ్ గౌడ్, మహమ్మద్ అభిబ్ తదితరులు పాల్గొన్నారు.