
జనవరి 11 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి[sangareddy].
ఈనెల 14న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని
హైదరాబాద్ నుండి నారాయణఖేడ్[Narayankhed], జోగిపేట పిట్లం, ఇతర పట్టణాలకు వెళ్లే ప్రయాణికుల తో సంగారెడ్డి బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్సులో ప్రయాణికులు, కెపాసిటీకి మించి బస్సు దొరుకుతుందో లేదో అని తొందరలో బస్సు సీట్లకు మించి ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, డిపో మేనేజర్ ఉపేందర్, దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. అవసరమనుకుంటే, అదనంగా బస్సులో నడుపుతామని ట్రిప్పుల సంఖ్య కూడా పెంచుతామని డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. ముఖ్యంగా సంగారెడ్డికి సెంటర్ గా ఉన్నటువంటి లింగంపల్లి పటాన్చెరు నుండి అధిక సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నారని ఈ రద్దీ మరో రెండు రోజులు కొనసాగవచ్చు అని డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు.