సిరి న్యూస్ సిద్ధిపేట[siddipet]:
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ అన్నారు. సిద్ధిపేటనియోజకవర్గంలోని నంగునూర్ మండలంలో జేపీ తండా, పాలమాకుల, రాంపూర్ గ్రామాల్లో మంగళవారం ఎస్డీఎఫ్ నిధులతో మంజూరు అయిన నూతన బోర్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి, మంతి కొండా సురేఖ సహకారంతో సిద్దిపేట నియోజకవర్గానికి సుమారు రూ.22 కోట్ల నిధులు తీసుకొచ్చానని, నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీతో పాటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించిందని తెలిపారు. గ్రామాల అభివృద్దిలో భాగంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు, పింఛన్లను అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మండలం కాంగ్రెస్ అధ్యక్షులు తప్పట శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవులపల్లి యాదగిరి, రాపోలు రాజ బహదూర్ రెడ్డి, రంగు.అశోక్ మాజీ ఎంపీటీసీ నితిన్ కుమార్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాదుల పవన్ కుమార్, డీసీసీ మహిళా అధ్యక్షులు ముద్దం లక్ష్మి, ఎలగందుల యాదగిరి, శ్రీనివాస్,ఎండీ.ఇమ్రాన్, మల్లేశం,తిపని. రాజేశ్వర్ ,కరుణాకర్ , శ్యామ్ రెడ్డి,శివ, అశోక్, సాయిశ్యామ్, వాహబ్, రాసిద్, ప్రతాప్, మహేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.