వెల్దుర్తి,[Veldurti] జనవరి 31 సిరి న్యూస్ :
శుక్రవారం రోజు మండల స్థాయిలో నిర్వహించిన భౌతిక రసాయనిక, సైన్స్ టాలెంట్ టెస్ట్ నందు విజయ దుందుభి మోగించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి విద్యార్థులు. సైన్స్ టెస్ట్ లు విద్యార్థుల విద్యా పనితీరును మెరుగుపరచడానికి, వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, వారిలో తార్కికం అభివృద్ధి చేయడానికి సహాయపడతాయి, మూఢనమ్మకాలను పారద్రోలేందుకు సైన్స్ పై అవగానే ముఖ్యమని మండల విద్యాధికారి ఏ.యాదగిరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సాంబయ్య పాల్గొన్నారు. మండల సాయి భౌతిక రసాయన టాలెంట్ టెస్టులో మొదటి బహుమతి జె. శ్రీచరణ్ గౌడ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి, రెండవ బహుమతి హెచ్.చంద్రవర్దన్ గౌడ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి, మూడవ బహుమతి వి. కార్తీక్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుక్కునూరు, విద్యార్థులు గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి పాఠశాల ఉపాధ్యాయులు వి. వెంకటస్వామి, సిహెచ్. చార్లెస్, అక్బర్, సోనీ, ఈ. పోచయ్య, కే.పద్మారావు, ఎల్. చందర్ పాల్గొనడం జరిగింది.
Home జిల్లా వార్తలు వెల్దుర్తి మండల స్థాయి భౌతిక రసాయనిక సైన్స్ టాలెంట్ టెస్ట్ యందు వెల్దుర్తి విద్యార్థుల ప్రతిభ