★శ్రీ రాయగిరి వెంకటేశ్వర ఆలయంలో ఉత్తరద్వారా దర్శనం చేసుకున్న భక్తులు.
★ ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి.
కౌడిపల్లి జనవరి 10 (సిరి న్యూస్)
వైకుంఠ ఏకాదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు శుక్రవారం మండల పరిధిలోని వెల్మ కన్నా గ్రామంలో వెలిసిన శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు ముందుగా ఆలయ పూజారులు రాఘవేంద్ర, శ్రీనివాస్, సాయి, స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు వివిధ గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు ఆలయ కమిటీ భజన మండలి భక్తుల కోసం అన్ని ఏర్పాతను చేశారు ఆలయ ప్రాంగణంలో భజన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నిర్వాహకులు ఆలయాన్ని రకరకాల పుష్పాలతో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మండల పరిధి వెల్మ కన్న శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ శిలుముల సుహాసిని రెడ్డి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఆలయ కమిటీ ,భజన మండలి, గ్రామ పెద్దలు, మాజీ సి డి సి చైర్మన్ చిలుముల దుర్గారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ , బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కాజీపేట రాకేష్, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పట్లోరి శ్రీనివాసరావు, పిఎసిఎస్ సొసైటీ డైరెక్టర్ గాదే రాయగిరి, మాజీ సర్పంచులు చిలుముల వెంకటేశ్వర రెడ్డి శివాంజనేయులు, ఎల్లం శేకులు, రజిని సుధాకర్, పాండ్ర శోభా నర్సింగ్ రావు, బి ఆర్ ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు రవి సాగర్ సారా ప్రతాప్ గౌడ్, కర్రోళ్ల విట్టల్ ,
రెడ్డి నర్సింలు ,కాయిత లక్ష్మణ్ బాగులు ,నాయకులు , మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రముఖులు, వివిధ గ్రామాల నుండి భారీగా తరలి వచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు.