చాకరిమెట్ల ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు..

Vaikuntha Ekadashi special pooja at Chakarimetla temple..
Vaikuntha Ekadashi special pooja at Chakarimetla temple..

శివ్వంపేట : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయం వద్ద వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ ఆంజనేయ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రుల దేవదత్త శర్మఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని దర్శనానికి వచ్చే భక్తులకు ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ ప్రధాన అర్చకులు దేవదత్త శర్మ దేవిశ్రీ ప్రభు శర్మ శ్రీ హర్ష శ్రీ చరణ్ శ్రీవత్సవ శర్మ ఆలయ సిబ్బంది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.