ఉమ్మడి జిల్లాలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం..
వైష్ణవాలయాలలో అభిషేకాలు.. ఉత్తర ద్వార దర్శనం..
సంగారెడ్డి : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో హరినామ స్మరణ మార్మోగింది.. ప్రధాన వైష్ణవాలయాలలో ఉదయం నుండే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శనం చేసుకుంటే అనంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
ఈ సందర్భంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలలో రామాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాలలో వేలాదిగా భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు ఉపవాస దీక్షలను చేపడతారు. పలు ఆలయాలలో ఆయా జిల్లాలకు చెందిన ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు.