★ఉత్తర ద్వార దర్శనానికి ముస్తాబైన ఆలయం.
కౌడిపల్లి [Kaudipalli] జనవరి 9 ( సిరి న్యూస్ )
మండల పరిధిలోని వెల్మకన్న గ్రామంలో
సుమారు 400 సంవత్సరాల క్రితం
శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి వెలసిన మహా పుణ్య క్షేత్రం లో
పుష్య శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయ కమిటీ అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాట్లను పూర్తి చేశారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే, స్వామి వారి అనుగ్రహం కలిగి అఖండ, ధన, కనక, వస్తు, వాహన వృద్ధి కలిగి మహా పుణ్యం లభించునని భక్తుల నమ్మకం