
సిరి న్యూస్ అందోల్:
అందోల్ -జోగిపేట [andol-jogipet] మున్సిపాలిటీ నందు జరుగుతున్న రేషన్ కార్డ్ ఇందిరమ్మ ఇండ్లు మరియు సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణ కొరకు వార్డు సభలు జరుగుతున్నందున వార్డు సభల నిర్వహణ అందరికీ తెలియజేసి ప్రజాప్రతినిధులతో పాటు అన్ని పక్షాల నాయకులు కూడా హాజరయ్యే విధంగా వార్డు సభలు నిర్వహించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ తిరుపతి కీ మెమోరాండం ఇస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా చూడాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి అందే విధంగా చూడాలని కమిషన్ గారి కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డివి నాగభూషణం, మాజీ ఎంపీపీ రామా గౌడ్, చాపల వెంకటేశం, బీర్ల శంకర్, మహేష్ యాదవ్, ఊస నాగరాజ్,నాయి కోటి అశోక్,ఆకుల శంకర్,నాగరత్నం గౌడ్,
పెండ గోపాల్, షకీల్, రఫీక్ గోరే,తదితర నాయకులు పాల్గొన్నారు.