క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలింపు
ధర్నాకు వెళ్తుండగా ఘటన..
శివంపేట:మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలంలోని చిన్న గొట్టిముక్కుల గ్రామ పరిధిలో టాటా ఏసి ట్రాలీ ఆటో బోల్తా పడి పదిమందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. వీరందరూ గుమ్మడిదల ధర్నాకు వెళ్తున్నారని సమాచారం. ఆటోలో ఉన్న వారందరూ చిన్న గొట్టిముక్కుల గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది.