మాసాయిపేట : మాసాయిపేట మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ లో డబ్బులు తీసుకొని వెళుతుండగా చందయ్యపేట క్రాస్ ఎక్స్ రోడ్డు మార్గంలో గుర్తుతెలియని దుండగులు వృద్ధురాలని బంగారం కోసం ముక్కు కోసి కొట్టి పడేశారు. మృతురాలు అక్కింపేట గ్రామానికి చెందిన కిష్టమ్మ గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. మఈతు మాసాయిపేట మండల కేంద్రంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేకుండా ఉండడంతో దుండగులు తప్పించుకున్నారు.
వెంటనే పోలీస్ అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాంటి ఎన్నో ఘోరాలు జరుగుతున్న మాసాయిపేట మండల కేంద్రంలో పట్టించుకునే నాధుడే కరువయ్యారు అని మాసాయిపేట గ్రామస్తులు మహమ్మద్ అక్బర్ బిక్షపతి చెబుతున్నారు. మాజీ వార్డు సభ్యులు భాస్కర్ ఇంటిముందు చెట్లు పెద్దగా పెంచుకోవడం వలన సీసీ కెమెరాలో మృతురాలిని హత్యచేసిన దుండగుడి ఆనవాళ్లు దొరకలేదని బిక్షపతి తెలిపారు. మృతురాలు ఏ విధంగా చనిపోయింది ఎవరు హత్య చేశారు పోలీసులు విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.