పండగ విశిష్టతను ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలు

Three competitions to reflect the uniqueness of the festival
Three competitions to reflect the uniqueness of the festival

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ప‌టాన్‌చెరు, [patancheru]జ‌న‌వ‌రి 13 సిరి న్యూస్ః
ముగ్గులకు హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోమవారం మండల పరిధిలోని ముత్తంగి సాయి ప్రియ కాలనీలో సీనియర్ నాయకులు ఆబేద్, మేరాజ్ ఖాన్ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మహిళల కోసం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పండగ విశిష్టతను ప్రతిబింబించేలా ముగ్గులు వేయడం పట్ల ఆయన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోటీలలో పాల్గొన్న 126 మంది మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, రామకృష్ణ, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..