నర్సాపూర్జ[Narsapur]నవరి 22 (సిరి న్యూస్)
ప్రజా పాలనలో భాగంగా ఈరోజు పురపాలక సంఘం నర్సాపూర్ పట్టణ పరిధిలోని 01, 03,04మరియు 11 వార్డు సభలు నిర్వహించారు 1 వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ అధ్యక్షతన వార్డు సభ నిర్వహించారు. 03 వార్డులో హిస్రత్ సిద్దిక ,04వ వార్డు శ్రీ ఎరుకల యాదగిరి , 11 వ వార్డు శ్రీ గోడ రాజేందర్ కౌన్సిలర్ల అధ్యక్షతన వార్డు సభలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జాబితా వివరములు అధికారులు చదివి వినిపించారు ఈ జాబితాలో పేర్లు లేనివారు అర్హత కలిగినవారు వార్డు సభలో లేదా పురపాలక సంఘం కార్యాలయం నందు కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డులో పేర్లు నమోదుకు ఇందిరమ్మ ఇండ్ల కొరకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చునని వార్డు ప్రజలకు తెలియజేయడం జరిగింది. వార్డు సభలలో కమిషనర్ పి రామకృష్ణ రావు,మేనేజర్ మధుసూదన్ ,వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.