ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పట్టణ మండలం నాయకులు
జనవరి 30 (సిరి న్యూస్)
సదాశివపేట.[sadasivpet]
మహాత్మాగాంధీ గారికి.. శిరస్సు వంచి పాదాభివందనాలు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహనికి పూలమాలవేసి సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ నివాళులర్పించారు.ఓ మహాత్మా. ఈ అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించు ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించుఈ చేతకాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు..ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు ఓ మహాత్మా.మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి, మీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతిపథంలో నడిపించాం.. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం.. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా, సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాం అయితే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి 30న 420 రోజులు పూర్తిచేసుకుంటోంది. మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో పంచిన గ్యారెంటీ కార్డుకు, ఇచ్చిన 420 హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్నారు.దేశానికి వెన్నుముక అయిన రైతుకు తెలంగాణలోని రేవంత్ సర్కారు వరుస వెన్నుపోట్లు పొడుస్తోంది. రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని నమ్మబలికి ఏడాదిపాటు ఊరించిఊరించి చివరికి 6 వేలే ఇస్తామని ఉసూరుమనిపించింది. చివరికి వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులను మళ్లీ అప్పుల పాలు చేసింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు, చీల మల్లన్న, పట్టణ పార్టీ కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కోడూరు రమేష్ సుధీర్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఎంపిటిసిలు సత్యనారాయణ భాస్కర్ సుధాకర్ మాధవరెడ్డి అహ్మద్ మాజీ కౌన్సిలర్లు సాతాన్ని శ్రీశైలం ఆకుల శివకుమార్ ఇంద్రమోహన్ గౌడ్ విద్యాసాగర్ రెడ్డి మోబిన్ షఫీ నసీర్ కోడూరు అంజన్న తాజా మాజీ సర్పంచ్లు మునిగే నవీన్ లక్ష్మారెడ్డి నరేష్ గౌడ్ హనుమంత్ రెడ్డి సలావుద్దీన్ దశరథ్ శేఖర్ సంగమేశ్వర్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాండు నాయక్ నాయకులు సిహెచ్ సత్యనారాయణ కామిల్ విజయ్ కుమార్ విట్టల్ రెడ్డి అరీఫ్ కామిల్ సంగన్న శ్రీశైలం మాణిక్ రెడ్డి అక్షయ్ హరీష్ బసవరాజ్ నర్సింలు మనోహర్ తదితర మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు.