-టిపిసిసి మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హకీమ్.
హత్నూర: ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏం.ఎ. హకీమ్ మండిపడ్డారు. గురువారం హత్నూర మండలం దౌల్తాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13 నెలల కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తూ రాష్ట్ర ప్రజలను పక్కదారిన పట్టిస్తున్నారన్నారు.
ప్రజాపాలన సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వంపై ప్రోటోకాల్ పేరుతో ప్రజా పాలనలో గొడవలకు పాల్పడుతున్నారని వాటిని మానుకోవాలన్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. గృహిణిగా ఉండే సునీత లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యే స్థాయికి నిలబెట్టింది కిందిస్థాయి కాంగ్రెస్ నాయకులే అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడే అర్హత బిఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వారి గుంతం కృష్ణ, ప్రసాద్ గౌస్,కృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.