పశువుల సంతలో కనిపించని మౌలిక వసతులు
నారాయణఖేడ్[narayankhed]: ఫిబ్రవరి 4 (సిరీ న్యూస్)
నారాయణఖేడ్ మంగళవారం సంతకు పశువులను విక్రయించేందుకు మార్కెట్కు పశువులను తరలిస్తే అక్కడ రైతులకు సరియైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా వేలంపాట ద్వారా లక్షల రూపాయలు పురపాలక సంఘానికి సమ కోరుతున్న రైతుల గోడు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత సంవత్సరంలో పశువుల సంత నిర్వాహనకు, మేకల నిర్వాణకు, కూరగాయల మార్కెట్ నిర్వాహనకు, వేలంపాట ద్వారా ఇంచుమించు 50 లక్షల నుండి 60 లక్షల వరకు ఆదాయం వస్తున్న. పురపాలక సంఘానికి ఆదాయం వచ్చేలా ఆలోచన చేస్తున్న పురపాలక సంఘం అధికారులు మాత్రం సుదూర ప్రాంతాల నుంచి వ్యాయాపాయాసాలకు ఓర్చి మార్కెట్ కు వస్తే వారికి కనీసం తాగునీటి సౌకర్యం కల్పించడంలో విపాలామవుతున్నారు.
నారాయణఖేడ్ పట్టణంలోని మంగళవారం పశువుల సంతలో పశువులు ఎండకు ఎండుతూ వానకు నానుతూఉన్నాయి రైతులు మాత్రం ఎక్కడో దుకాణాల సముదాయం సూర్ల పక్కన నీడ ఉంటే అక్కడే కూర్చుని సేద తీరుతున్నారు. పశువులు మాత్రం ఎండలోనే ఉంటున్నాయి తాగడానికి నీటితోట్లు లేవు రైతులు తాగడానికి వారికి కూడా నీళ్లు లేవు నీడ లేదు. ఇలా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. పంచాయితీ ఖజానాను నింపుకోవడంలో చూపిస్తున్న శ్రద్ధ ప్రజల అవసరాలను గుర్తించలేకపోతున్నారు. పశువుల సంతలో పశువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలి, పశువుల నీటి వసతి కోసం బోరుబావిని తవ్వించాలి, రైతుల కోసం షెడ్లు ఏర్పాటు చేయాలి, తాగునీరు మరుగుదొడ్లు వసతి కల్పించాలి, కానీ ఇవేవీ పట్టవు రైతుల నుంచి దోచుకోవడమే తప్ప వారికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వేల రూపాయల అప్పులు చేసి సాగు చేసిన పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పశువులను అమ్మి వాటికి వడ్డీలు చెల్లించేందుకు కూడా రైతులు తంటలు పడుతున్నారు. నారాయణఖేడ్ మునిసిపల్ డివిజన్ కేంద్రంలో ప్రతి మంగళవారం పశువుల సంత జరుగుతోంది. దీనికి పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన రైతులు వ్యాపారాలు ఇక్కడ పశువుల క్రయవిక్రయాలు జరుగుతుంటారు. ఈసారి వర్షాలు అంతంత మాత్రమే కురవగా తగిన స్థాయిలో వర్షాలు లేక వర్ణు దేవుడు ముఖం చాటేసాడు వర్ష భావం కారణంగా పంటలన్నీ సరిగ్గా పండక చేసిన అప్పులు వడ్డీలు చెల్లించేందుకు రైతులు తమ పాకలో ఉన్న పశువులను అమ్ముకునేందుకు సిద్ధం అవుతున్నారు.
పశువుల అంగడి పాలకుల నిర్లక్ష్యంతో కొట్టుమిట్టాడుతోంది. పశువుల అంగడిలో కనీస సౌకర్యాలు కల్పించే నాధుడు లేక ఉనికి కోల్పోయే పరిస్థితి దాపురించింది. ఒకప్పుడు పశువుల క్రయవిక్రయాల అడ్డగా విరజిల్లిన పశువుల అంగడి నేడు వెలవెలబోతుంది. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి సంతకు వచ్చిన రైతులకు పశువులకు నీడ, నీటి తొట్లు సరియైన వసతులు కల్పించాలని కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ పశువుల అంగడి గతంలో ఎంతో పేరుగాంచింది. ఈ అంగట్లో అన్ని రకాల పశువులు లభిస్తాయని సంగారెడ్డి జిల్లాతో పాటు సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, చుట్టుపక్కల జిల్లాల నుంచి అనేకమంది రైతులు వ్యాపారులు దళారులు వచ్చేవారు. అప్పట్లో మంగళవారం వచ్చిందంటే చాలు పశువుల సంతాకు వేలాది పశువులు క్రయవిక్రయాలకు వచ్చేవి అప్పట్లో ప్రతి ఇంట్లో కనీసం ఐదు పశువుల నుంచి పదుల సంఖ్యలో పశువులు ఉండేవి పశువుల అంగట్లో గేదెలు, ఆవులు, లేగ దూడలు, దున్నపోతులు, కాడెద్దులు, ఉండేవి కానీ ప్రస్తుతం అంగట్లో గేదెలు మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకు కారణం గ్రామాల్లో పశుపోషణ భారం కావడం కూలీలు లభించకపోవడం రైతులు యంత్రాల ద్వారా పంటలు సాగు చేస్తుండడంతో పశు పోషణ పూర్తిగా తగ్గిపోయింది. గేదెలను పెంచుకుంటున్న వారు సైతం పశుగ్రాసం కొరత కారణంగా పల్లెల్లో పాడి పశువులు తగ్గిపోవడంతో పాల ప్యాకెట్లను వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తిరిగి గ్రామాల్లో పూర్వపు వైభవం తీసుకురావాలంటే గ్రామాల్లో పశువుల పోషణ కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులని వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి దీంతో రైతులు కూలీలుగా మారుతున్నారు. కానీ వారు పెంచుకునే పశువులను పెంచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మూగజీవాల పరిస్థితి మరి అధ్వానంగా తయారైంది. పశుగ్రాసం కొరత కొందరు వాటి అవస్థలు చూడలేక అమ్ముకుంటున్నారు.