సిరి న్యూస్ కొల్చారం
మండల కేంద్రమైన కొల్చారం[kolcharam]లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో రెండవసారి దొంగతనం జరగడం సంచలనంగా మారింది.. గతంలో ఒకసారి గుడి గంటతోపాటు.. బయట ఉన్న గల్లా పెట్టిన సైతం దొంగతనానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు. అమ్మవారి ముక్కుపుడకతో పాటు. గల్లా పెట్టెను సైతం దొంగతనం చేయడంతో.. గౌడ సంఘం నాయకులు భక్తులు ఆందోళన చెందుతున్నారు. వరుస దొంగతనాలు జరగడం.. స్థానిక పోలీసులు గస్తీ మామూలుగా .నిర్వహించడం. దొంగతనాలు యదేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి అమ్మవారికి అలంకరించిన రెండు ముక్కుపుడకలతో పాటు.. చాలా రోజుల నుండి ఆలయంలో ఉన్న హుండీ డబ్బులు తీయకపోవడంతో. పెద్ద ఎత్తున డబ్బులు జోరికి పాల్పడి ఉండవచ్చునని.. గౌడ సంఘం నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ. దొంగతనం చేస్తున్న వ్యక్తి స్పష్టంగా కనిపించకపోవడంతో
గుర్తుపట్టలేక పోతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.గల్లా పెట్టెను ఎల్లమ్మ టెంపుల్ నుండి 200 మీటర్ల దూరం తీసుకువెళ్లి. డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది..