కల్లుగీత కార్మిక సంఘం పోరాటాలుఅభినందనీయం

The struggles of the Kallugeeta labor union are commendable
The struggles of the Kallugeeta labor union are commendable

కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే, చింత ప్రభాకర్
ఈరోజు సంగారెడ్డి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్లుగీత కార్మిక సంఘం రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
జనవరి 12 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ మాట్లాడుతూ. కల్లుగీత కార్మిక సంఘం, గౌడ కులస్తుల సంక్షేమం కోసం కల్లుగీత కార్మికుల ఉపాధి కోసం వృత్తి రక్షణ కోసం, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించి వాటిని అన్నిటిని క్యాలెండర్ లో పొందుపరిచి, ఒక ఆకర్షణీయమైన నూతన క్యాలెండర్ ను తీయడం అభినందనీయమని ఆయన అన్నారు.గత10సంవత్సరాలలోటీఆర్ఎస్ ప్రభుత్వం గౌడ కులస్తుల సంక్షేమం కోసం కార్మికుల ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, చెట్టు పన్ను రద్దు చేయడం, మూసివేసిన కళ్ళు దుకాణాలు తెరిపించడం, జిల్లాలోని TFT మంజూరు చేయడం, కళ్ళు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు నిలిపివేయడం,హరితహారంలో ఈత తాటి చెట్ల పెంపకాలు చేపట్టడం, చెట్టు మీద నుంచి పడితే మరణిస్తే 2 లక్షలు ఉన్న ఎక్స్గ్రేషియా ఐదు లక్షలకు పెంచడం, బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం,
హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో నీర స్టాల్ ను ప్రారంభించడం, హైదరాబాద్ కోక పేటలో గౌడ ఆత్మగౌరవ భవనంకు నిధులు భూమి మంజూరు చేయడం,
మద్యం షాపులలో 10% గౌడ కులస్తులకు రిజర్వేషన్లు కల్పించడం, బీసీ కార్పొరేషన్ ద్వారా దాన సంస్కరణ కోసం తక్షణ సహాయం 25000 మంజూరు చేయడం, 50 సంవత్సరాలకే గీత కార్మికులకు పెన్షన్ ఇవ్వడం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి గౌడ కులస్తులకు అండగా నిలబడడం జరిగిందని, సంగారెడ్డి జిల్లాలో గౌడ భవనం కోసం ఎకరం భూమి 25 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని వారు గుర్తు చేశారు,, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గౌడ కులస్తులకు ఎన్నికలలో అనేకమైన హామీలు ఇచ్చినప్పటికీ ఏడాది కాలంలో ఏ ఒక్కటి అమలు చేయలేదని వెంటనే వాటిని పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు రాబోయే రోజులలో కల్లుగీత కార్మిక సంఘం చేసే పోరాటాలకు టిఆర్ఎస్ పార్టీ తరఫున నా తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తానని గౌడ కులస్తులందరికీ అండగా ఉంటానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నక్క నాగరాజు గౌడ్, మాజీ జెడ్పిటిసి మల్ల గౌడ్ మాజీ జెడ్పిటిసి మనోర్ గౌడ్, మాజీ సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, గౌడ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ మాజీ ఎంపీటీసీ పాండుగౌడ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అంజన్న గౌడ్. జిల్లా కమిటీ సభ్యులు నరసింహ గౌడ్ రామ గౌడ్. పరశురామ్ గౌడ్ , సంగారెడ్డి మండల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులు కృష్ణ గౌడ్ ప్రధాన కార్యదర్శి హరీష్ గౌడ్, నాయకులు వెంకటేశం గౌడ్ నరసింహా గౌడ్ సంగమేశ్వర్ గౌడ్ నాగేందర్ గౌడ్ (చిన్న గౌడ్) ప్రతాప్ గౌడ్, శ్రీధర్ గౌడ్, చెన్నగౌడ్ గోపాల్ గౌడ్, పవన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు