సంగారెడ్డి జిల్లా పిఎస్టీల సంఘం ఎన్నిక ఏకగ్రీవం

ఫోటో స్టూడియో,వీడియోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షులుగా సుప్పాల శ్రీనివాస్

సంగారెడ్డి జనవరి 5 సిరి న్యూస్ : సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం స్థానిక విద్యా భారతి స్కూల్లో (Vidya Bharti School) జిల్లాలోని అన్ని మండలాల పిఎస్టీలు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి జిల్లా అధ్యక్షుని, ప్రధాన కార్యదర్శి సెక్రటరీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణం, కొండాపూర్ మండలం , జహీరాబాద్ పట్టణము మండలము, హత్నూర మండలము, చౌటకూర్ మండలము, పుల్కల్ మండలము, ఆర్సిపూర్ మండలం, పట్టణము మునిపల్లి మండలము, వట్పల్లి మండలము, నారాయణఖేడ్ డివిజన్ మరియు పట్టణము మండలం, అధ్యక్షులు కార్యదర్శులు, కోశాధికారులు… పెద్ద ఎత్తున పాల్గొని ఏకగ్రీవంగా జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్ (Suppala Srinivas) ని అధ్యక్షునిగా, మందాపురం శ్రీకాంత్ ని ప్రధాన కార్యదర్శిగా, పుట్టి బాలరాజును జిల్లా కోశాధికారిగా అందరూ ఎన్నుకోవడం జరిగింది.

తధానంతరం జిల్లాలోని వివిధ మండలాల పదవీకాలం ముగిసిన తర్వాత కొత్తగా ఎన్నుకున్న పి ఎస్టి లకు వారికి నియామక పత్రాన్ని సన్మానాన్ని చేయడం జరిగింది. జిల్లా మిగతా కార్యవర్గాన్ని వారం పది రోజుల్లో ప్రకటించి, జిల్లా యొక్క కార్యవర్గ సమావేశం అతి తొందరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్టి ఏక ఏకగ్రీవ తీర్మారాన్ని ఆర్సిపూర్ అధ్యక్షులు అనిల్ కుమార్ , జహీరాబాద్ అధ్యక్షులు రాజు, కొండాపూర్ సీనియర్ ఫోటోగ్రాఫర్ జనార్దన్, ముగ్గురు కలిసి ఈ యొక్క ఏకగ్రీవ తీర్మానాన్ని వారి సమక్షంలో అందరి అభిప్రాయం తీసుకొని ప్రకటించడం జరిగింది.

మాపై నమ్మకం నుంచి మల్లొకసారి జిల్లా పిఎస్లను ఎన్నుకున్నందుకు జిల్లా పక్షాన జిల్లా ఫోటోగ్రాఫర్ల అందరి పక్షాన మమ్మల్ని నియమించిన పెద్దమనుషులకు మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని ఏకగ్రీవంగా చేపించిన అన్ని మండలాల పిఎస్టిలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.