నర్సాపూర్[Narsapur], ఫిబ్రవరి 6 (సిరి న్యూస్)
ప్యారా నగర్ లో డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా గురువారం నర్సాపూర్ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు దీనికి సంపూర్ణ మద్దతుగా వ్యాపారస్తులు విద్యాసంస్థలు బందు నిర్వహించారు బంధు కార్యక్రమంలో సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ప్యారా నగర్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిలిపివేయాలి. ఈ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల గ్రామాల నల్లవల్లి కొత్తపల్లి నాగిరెడ్డి గూడెం గుమ్మడిదల ప్రజలు అనారోగ్యాలకు గురవుతారు నర్సాపూర్ అడవిలో నుండి వర్షాలు కురిసినప్పుడు కలుషిత నీరు అంతా రాయరావు చెరువు లోకి రావడం జరుగుతుంది. గ్రౌండ్ వాటర్ కూడా కలుషితమై పట్టణ ప్రజలు అనారోగ్యాలకు గురవుతారు 144 సెక్షన్ తో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను భయభ్రాంతులను చేసి అరెస్టులు చేస్తున్నారు అఖిలపక్ష నాయకులను నిర్బంధించడం అనుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వాల్లస్ మల్లేష్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ కౌన్సిలర్లు ప్రజా నాయకులు తదితరులు పాల్గొన్నారు