సిరి న్యూస్ సిద్ధిపేట[siddipet]
హనుమకొండలో జరిగే పాటల పల్లకి కార్యక్రమం
12 గంటల కి విజయవంతం చేయాలని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల కమిటీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పిన్నింటి. దాసు కోరారు.. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిసారధిలో అవకాశం లేక నిరుద్యోగులుగా మిగిలిపోయిన వాళ్ళ పక్షాన ప్రముఖ ఉద్యమ కవి గాయకులు నేర్నాల కిషోర్ ఆధ్వర్యంలో.. పాటల పల్లకిలో 12 గంటల కార్యక్రమం శుక్రవారం హనుమకొండలో ఉందన్నారు.. కార్యక్రమంలో నిరుద్యోగుల పక్షాన నేర్నాల కిషోర్ ,అనువోజు వెంకటేష్ దరువు అంజన్న, కిరణ్ ,చక్రాల రఘు తదితరులు హాజరు కానున్నారని తెలియజేశారు.. ఈ ప్రజా ప్రభుత్వం నిరుద్యోగ కళాకారులకు తప్పకుండా న్యాయం చేస్తుందని..అర్హులైన కళాకారులకు అందరికీ సారధిలో ఉద్యోగం కల్పించాలని.. సారధిలో అవకాశం వచ్చేంతవరకు కళాకారులు రోజు ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలని.. ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకునే.. విధంగా కళాకారులందరూ ఐకమత్యంతో.ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు….ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లాకార్యదర్శికుంచం శ్రీనివాస్ యాదవ్, కళా ప్రసాద్ ,భుజంగం ,ఎర్రబెల్లి శ్రీనివాస్, పరమేశ్ ,రమేష్ ,యాదగిరి.భుజంగంసురేష్ ,విధూ మౌళి,కే.రాజు,యాదగిరి. బొల్లం రాజేష్ నరేష్.. తదితర కళాకారులు పాల్గొన్నారు.