పి ఆర్ టీ యు, టీ ఎస్
సిరి న్యూస్ చేగుంట[Chegunta] జనవరి 27,
పి అర్ టీ యు, టీ ఎస్ రాష్ట్ర సంఘ అధిష్టాన ఆదేశానుసారం నేడు చేగుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ అధికారి కి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రవేశ పెట్టిన నూతన ఏకీకృత పెన్షన్ పెన్షన్ విధానాన్ని నిరసిస్తూ, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు ఈ కార్య క్రమంలో పి అర్ టీ యు మండల అధ్యక్షులు గజగట్ల నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి శంకర్,జిల్లా ఉపాధ్యక్షులు చల్లా రామకృష్ణ, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు స్వప్న, సౌజన్య,మండల కో ఆర్డినేటర్ మధుసూధన్,గోపాల్,రాజశేఖర్,సురేష్, రాములు,రజిని,శంకర్,సిద్దిరాములు, తదితరులు పాల్గొన్నారు