పంటలకు చీడపీడలు జాడ లేని వ్యవసాయ శాఖ అధికారులు.

The officials of the agriculture department have no trace of pests on the crops.
The officials of the agriculture department have no trace of pests on the crops.

నారాయణఖేడ్[narayankhed] ఫిబ్రవరి 6 (సిరి న్యూస్)
ముఖ్యంగా నారాయణఖేడ్ డివిజన్లో ఈ యాసంగి పంటగా జొన్న, వరి పంటలు ఎక్కువగా సాగు చేశారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జొన్న సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయ అధికారులు అందుబాటులో లేకపోవడం వ్యవసాయ కార్యాలయం ఎక్కడుందో రైతులకు తెలియకపోవడం వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలకు వచ్చి రైతులకు పిలిచి అవగాహన కల్పించకపోవడం వ్యవసాయ అధికారులు రోజు ఒక గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో పొలాలు జొన్న పంటను పరిశీలించాలి కానీ అది ఎక్కడ కూడా జరగడం లేదు అని రైతులు వాపోతున్నారు. దీంతో రైతులే తమకు తెలిసిన విధంగా వ్యవసాయం చేసుకోవడం జరుగుతోంది. రైతులు ప్రధానంగా తమకు తామే వ్యవసాయ అధికారులు లేకుండానే సొంతగా తెలుసుకొని పంట మార్పిడికి అలవాటు పడడం జరిగింది. దాంట్లో ప్రధానంగా రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో లేకపోవడం క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించకపోవడంతో రైతులె తమకు తోచినట్టు జొన్న పంటపై మక్కువతో వేయడం జరిగింది. పంట మార్పిడి చేయడం వల్ల ఆ భూమి కాగి గుల్లబారి తర్వాత రైతులకి పెట్టుబడి తక్కువ అవుతుందని దిగుబడి కూడా ఎకరానికి 20 నుంచి 25 కింటల్ రావడం ప్రధానంగా జొన్న పంట సాగు చేయడం వరి, కి బదులు జొన్న పంట ఆ స్థానాన్ని భర్తీ చేయడం వల్ల ఈ వరి, పంట ఈ సంవత్సరం కొంత తగ్గుముఖం పట్టింది. సంజీవరావుపేట్, ర్వకల్, తుర్కపల్లి, గంగాపూర్ చెందిన కొంతమంది రైతుల పొలాలు జొన్న పంటలకు తెగుళ్లు చోకి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మందులు పిచికారి చేసిన దారిలోకి రావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు చెబుదామంటే ఎక్కడ ఉంటారో తెలియదని వాపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల ఆఫీస్ ఎక్కడుంటుందో చిన్న సన్న కారు రైతులకు అసలే తెలియదంటున్నారు. రైతు ఎలాగైనా వ్యవసాయ అధికారి ఫోన్ నెంబర్ దొరికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరన్నారు. అదే పెద్ద రైతు ఫోన్ చేస్తే వాళ్ళ వద్దకు వచ్చి చూసి వెళుతున్నారు. కానీ మాలాంటి చిన్న రైతులను మాత్రం ఈ వ్యవసాయ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని చిన్న సన్న కారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు చిన్న సన్నకారు రైతుల వద్దకు వచ్చి క్షేత్రస్థాయిలో చూసి వారికి ఏ మందులు చల్లాలో ఏ మందులు పిచికారి చేయాలో తెలపకపోవడంతో చిన్న రైతులు వారికి తోచిన విధంగా నారాయణఖేడ్ లోని అందుబాటులో ఉన్న పార్టీలైజర్ షాప్ వద్దకు వెళ్లి వారు ఇచ్చిందే తీసుకొని వచ్చి తమ పొలాలకు మందులు చల్లడం పిచికారి చేయడంతో అది పనిచేయడం లేదన్నారు. దీంతో రైతు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పుల పాలు అవుతున్నారు. ప్రస్తుతం రైతులు వరి,జొన్న పంటలకు తెలిసి తెలియక అధిక మోతాదులో యూరియా క్రిమిసంహారక మందులు వాడడం వల్ల ఇంకా కొన్ని రోగాల బారినపడి వరి,జొన్న పంటలు నాశనం అవుతున్నాయి. రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి సరియైన సూచనలు చేయాలని రైతులు కోరుతున్నారు. అందుబాటులో లేక రైతులే తెలిసి తెలియని మందులను వాడి పంటలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు రైతుల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి సూచనలు ఇచ్చి పంటలకు తగు చర్యలు తీసుకునే విధంగా చేయాలని రైతులు కోరుతున్నారు.