పంచాయితీ సిబ్బందిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలి
సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి.
శివంపేట్[shivampeta] జనవరి 9 (సిరి న్యూస్ )
గ్రామ పంచాయితీ సిబ్బందిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి అన్నారు. పంచాయితీ సిబ్బందికి గత 5,6 నెలల వేతనాలు చెల్లించాలని తమ డిమాండ్లు నేరవేర్చాలని కోరుతూ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డిమాట్లాడుతూ పంచాయితీ సిబ్బందిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని, 51వ నెంబర్ జివోను సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని,
కేటగిరీల వారీగా వేతనాలను పెంచాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, బకాయి వేతనాల చెల్లింపులలో జరుగుతున్న జాప్యంపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అనేక రూపాల్లో ఉద్యమాలు చేసి టోకేన్ సమ్మెకు దిగామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేని యెడల జనవరి 10వ తేదీ తర్వాత ఎపుడైనా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.గ్రామ శుభ్రతతో పాటు ప్రభుత్వ అనేక పథకాలను గ్రామపంచాయతీ కార్మికులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని గత 5,6 నెలల నుండి వేతనాలు లేక కుటుంబ పోషణ భారమైందని అన్నారు.వేతనాలు లేక దసరా, దీపావళి పండుగలు జరుపుకోలేని పరిస్థితి ఏర్పడిందని రాబోయే సంక్రాంతి నాటికైనా పెండింగ్లో వేతనాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల మండల కార్యదర్శి శంకర్ బాలకృష్ణ ,వసంత ,స్వామి, అశోక్, వీరస్వామి ,సిద్ధమ్మ ,పద్మ తదితరులు పాల్గొన్నారు .