నారాయణఖేడ్ (సిరి న్యూస్):
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని కాంజీపూర్ రోడ్డు వయ వెంకటేశ్వర దేవాలయం దగ్గర నుండి నారాయణఖేడ్ ఆర్టీసీ బస్సు డిపో డి.ఎస్.పి కార్యాలయం హైదరాబాద్ రోడ్డు ను కలిపే బైపాస్ రోడ్డు కు శంకుస్థాపన చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం వలన నారాయణఖేడ్ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది మరియు ఈ రోడ్డు నిర్మాణం వలన నారాయణఖేడ్ పట్టణంలో చాలావరకు ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయాణికులకు ఏలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయని ప్రజలకు కూడా ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం సులభతరం అవుతోందని ఎమ్మెల్యే అన్నారు. అలాగే నారాయణఖేడ్ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితమే టి యు ఐ ఎఫ్ డి సి. ద్వారా 20 కోట్ల నిధులతో డ్రైనేజీ కాలువలు మరియు సిసి రోడ్ల నిర్మాణ కోసం శంకుస్థాపన చేసి పనులను కూడా ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ రోడ్డు కొరకు భూమిని ఇచ్చినందుకు రైతులకు మరియు ఈ ప్రాంత ప్రజలకు నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి జరిగేలా కృషి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం భూమిని ఇచ్చిన రైతులను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప షెట్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, హనుమాoడ్లు,రాజేష్ చౌహన్,రామకృష్ణ, వివేకానంద,సద్దాం,సయ్యద్,నర్సింలు, తాహెర్ మండలాధ్యక్షులు, రమేష్ చౌహాన్,పండరి రెడ్డి,ముంతాజ్ సెట్ మాజీ ఎంపీటీసీలు,బొడ్డు అంజయ్య,జీవన్,మేకల శ్రీనివాస్,అవుసలి విఠల్,మొగులయ్య,మహేష్, బమ్మయ్య, శెట్టి శంకర్,దారం శేకర్, వీర్ శెట్టి,మరియు నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.